kalki movie review | prabas movie bumper hit | pan india super hit

June 27, 2024

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ (Prabhas) అభిమానుల‌తో పాటు మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం వచ్చేసింది. ప్రభాస్ ‘క‌ల్కి’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించ‌గా.. ఎవ‌డే సుబ్రహ్మణ్యం, మ‌హాన‌టి చిత్రాల ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సినిమా విడుద‌ల‌కు ముందు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ఏమీ జరగనప్పటికీ సినిమా ఫస్ట్ షో నుంచే దూసుకుపోతోంది.

ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. కొన్ని చోట్ల సర్వర్లు డౌన్ అయిపోయినంత రేంజ్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరిగాయి.మరి ఇన్ని అంచనాలతో వచ్చిన క‌ల్కి ప్రేక్షకులని ఎలా అలరించింది? ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా..రివ్యూ ఓ సారి చూద్దాం..  ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట‌ర్ కొట్టిన ప్ర‌భాస్, థియేట‌ర్ల‌లో పూన‌కాలే, తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేట‌ర్ల ద‌గ్గ‌ర ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌

“అశ్వత్థామ హతః కుంజరః” అనే డైలాగ్‌తో కురుక్షేత్ర యుద్ధభూమిలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కథ మొదలవుతుంది. ఈ యుద్ధంలో సకల సైన్యాన్ని కోల్పోయి.. నాన్నని దూరం చేసుకొని కోపంతో రణభూమిలో రగిలిపోతుంటాడు అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్).తన వాళ్లని చంపిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య అయిన ఉత్తర (మాళవిక నాయర్) గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇది తెలిసి యుద్ధభూమిలోకి శ్రీకృష్ణ పరమాత్మ వస్తాడు.

రా కృష్ణ.. ఇక మిగిలింది నేనే నన్ను కూడా అంతం చేస్తావా అంటూ కృష్ణుడితో యుద్ధానికి సై అంటాడు అశ్వత్థామ. దానికి కృష్ణుడు.. నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించుకుంటావ్ అశ్వత్థామ.. గర్భంలోని పిండంపైనే అస్త్రాన్ని సంధించావ్.. నీకు చావు అనేదే లేకుండా శాపం ఇస్తున్నాను.. కలియుగాంతం వరకూ నువ్వు కొండ కోనల్లో ఇలానే తిరుగుతావ్.. నీ శరీరం నుంచి చీము, రక్తం స్రవిస్తాయి.. అయినా సరే నీకు చావు దరిచేరదు” అంటూ అశ్వత్థామ నుదిటిపై ఉండే ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటాడు కృష్ణుడు.  క‌ల్కి మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్ తో పాటూ ఈ ఐదుగురి గెస్ట్ అప్పియ‌రెన్స్ మీరు అస్సలు ఊహించి ఉండ‌రు

అశ్వత్థామ క్షమించిమని వేడుకుంటూ దీనికి ప్రాయశ్చిత్తమే లేదా అంటూ ప్రాధేయపడతాడు. కలియుగాంతంలో పాపం మితిమీరిపోతుంది.. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి.. గంగానది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది.. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది.. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను. కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలికి ఉంటుంది. నాపైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించినా నువ్వే ఆ రోజు తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి కాపాడాలి.. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరికి వస్తుంది.” అంటూ కృష్ణుడు చెబుతాడు.

6 వేల సంవత్సరాల తర్వాత అంటూ కథ మొదలవుతుంది. ఈ యుగంలో ‘2898 ఏడీ’లో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా నీళ్లు లేక తిండి లేక జనాలు అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులు అన్నీ లాగేసుకొని ‘కాంప్లెక్స్’ (నగరం) అనే ఓ సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్). కాశీ పట్టణంలో ఉన్న ప్రజలకి సుప్రీమ్ ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది. ఇక ఏదైనా భౌంటీ (చేసే పనిని అలా పిలుస్తారు) వస్తే దానిని పూర్తి చేసి యూనిట్స్ (పనికి ఇచ్చే డబ్బు) దాచుకుంటూ ఉంటాడు భైరవ (ప్రభాస్). ఎవరు ఎక్కువ యూనిట్స్ ఇస్తానంటే వారి వైపు పని చేస్తుంటాడు. లాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్‌లో సెటిలైపోవాలనేది భైరవ కోరిక. దీనికి తన కారు ‘బుజ్జి’ సాయం చేస్తూ ఉంటుంది.

సుప్రీం యాస్కిన్ త‌ల‌పెట్టిన ప్రాజెక్ట్ కె కోసం, కాంప్లెక్స్ సైన్యం కాశీకి వ‌చ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్‌-కె కోసం గ‌ర్భ‌వ‌తుల్ని చేసి, వారి నుంచి సీరమ్ సేక‌రిస్తూ ప్ర‌యోగాలు చేప‌డుతుంటారు. అలా సుమతి (దీపికా ప‌దుకొణె) కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయి గ‌ర్భం దాలుస్తుంది. మ‌రోవైపు రేప‌టి కోసం అంటూ శంబ‌ల ప్ర‌జ‌లు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ త‌ల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ త‌ల్లి సుమ‌తి అని న‌మ్ముతారు. (kalki 2898 ad review) మ‌రి ఆమెని కాంప్లెక్స్ ప్ర‌యోగాల నుంచి ఎవ‌రు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వ‌త్థామకీ, భైర‌వ‌కీ సంబంధం ఏమిటి?సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ -కె ల‌క్ష్య‌మేమిటి? ఇలా సినిమా అనేక ట్విస్టులు ఇస్తూ ముందుకు సాగుతుంది.

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ (Director Nag Ashwin). క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌, లీనం చేసే క‌థ‌, బ‌ల‌మైన పాత్ర‌ల‌తో మ‌న రేప‌టి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్ర‌లు, క‌ల్పిత ప్ర‌పంచాలు ఈ సినిమాలో కనిపించిన‌ప్ప‌టికీ, వాటికి మ‌న పురాణాల్ని మేళ‌విస్తూ క‌థ చెప్పిన తీరు బాక్సాపీస్ కొత్త చరిత్రకు నాంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక నటన గురించి చెప్పాలంటూ అందరూ తమ పాత్రల్లో దుమ్మురేపారు.

property services near me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *