
అయోధ్య రామమందిరం ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో నెలకొనిఉన్న హిందూ దేవాలయం. ఇది రామ జన్మభూమి, 2020 ఆగష్టు 5న, రామమందిర నిర్మణ ప్రారంభానికి భూమి పూజని భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షించింది. 2024 జనవరి 22న, బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది